Free Petrol Offer To Bikini Guys: బికినీలతో వస్తే ఉచితంగా పెట్రోలు, రష్యాలో వినూత్న ఆఫర్, క్యూకట్టిన జనాలు, బిత్తరపోయి ఆఫర్ ఎత్తేసిన యజమాని
బ్రాండును ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్లాన్లు వేస్తుంటారు. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండేలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో చాలామంది ఆరితేరిపోయారు కూడా.. ఇప్పుడు ఈ వరసలోకి రష్యాలోని వ్యక్తి చేరాడు. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సరికొత్తగా ఎత్తుగడవేసి బొక్క బోర్లా పడ్డాడు.
Moscow, November 19: బ్రాండును ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్లాన్లు వేస్తుంటారు. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండేలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో చాలామంది ఆరితేరిపోయారు కూడా.. ఇప్పుడు ఈ వరసలోకి రష్యాలోని వ్యక్తి చేరాడు. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సరికొత్తగా ఎత్తుగడవేసి బొక్క బోర్లా పడ్డాడు.
ఆలస్యం చేయకుండా వివరాల్లోకెళితే.. రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన పెట్రోల్ బంక్‌కు పబ్లిసిటీ కోసం కొత్తగా ఏదైనా చేయాలని వెరైటీగా ఆలోచించాడు. ఇందులో భాగంగా మగవాళ్లు బికినీ ధరించి తమ వాహనాలతో వచ్చిన వారికి ఫ్రీగా పెట్రోల్ (free fuel ) పోస్తామని ప్రకటించాడు.
ఇంకేముంది ..ఈ ఫ్రీ స్కీం గురించి తెలుసుకున్న స్థానికులు బికినీలు ధరించి భారీగా పెట్రోల్ బంక్‌కు తరలివచ్చారు. కిలోమీటర్ల మేర ఈ బికినీదారులు (bikini guys) పెట్రోల్ కోసం బారులు తీరారు. రష్యాలోని సమరాలో ఆపర్ నడిచింది. అయితే ఈ ఆఫర్ దెబ్బకి ఓనరుకు చుక్కలు కనిపించాయి.
బికినీలతో పురుషులు
ఒల్వి గ్యాస్ స్టేషన్ (Olvi gas station in Samara) యాజమాని ఈ వినూత్న ఆఫర్ ద్వారా భారీగా నష్టపోయాడు. బారులు తీరిన జనాన్ని చూసి ఇంతమందికి ఉచితంగా పెట్రోల్ పోస్తే తన బంకు దివాళా తీస్తుందని గ్రహించి వెంటనే ఆఫర్‌ను తీసేశాడు.
కొంత మేర నష్టం వచ్చిన గానీ తన పెట్రోల్ బంక్‌కు మాత్రం తక్కువ సమంయలోనే భారీ ప్రచారం లభించిందని యజమాని పేర్కొన్నాడు. ఈ ఆఫర్‌లో భాగంగా తమ వాహనాల్లో ఉచితంగా పెట్రోల్ పోయించుకునేందుకు మగవారు సైతం బికినీ ధరించి పెట్రోల్ బంక్ ముందు బారులు తీరారు. ఆ సమయంలో పురుషులు బికినీ ధరించినప్పుడు తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.