IPL Auction 2025 Live

Viral Video: నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు.. పంజాబ్‌లోని జలంధర్‌ జాతీయ రహదారిపై హోంగార్డు నిరసన.. వీడియో వైరల్

దీంతో హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్‌‌లోని జలంధర్‌ లో తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Credits: Twitter

Newdelhi, July 23: సహోద్యోగుల అవినీతిని (Corruption) చూసి నిజాయితీ గల ఓ హోంగార్డు (Home Guard) తట్టుకోలేకపోయారు. దీంతో  హైవేపై (Highway) నిరసనకు (Protest) దిగారు. పంజాబ్‌‌లోని (Punjab) జలంధర్‌ లో (Jalandhar) తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. హోంగార్డు నిరసనతో అక్కడ కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ‘నేను ఎంతో కష్టపడి దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్‌ లోని వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్‌పూర్ ప్రాంతంలో పఠాన్‌ కోట్‌ హైవేపై హోంగార్డు నిరసనకు తెరలేపారు. తొలుత ఆ హోంగార్డు రహదారికి అడ్డంగా ఓ తాడు కట్టి ట్రాఫిక్ వెళ్లేందుకు మార్గం లేకుండా చేస్తూ నిరసనకు దిగారు. మరో పోలీసు అతడిని అడ్డుకోవడంతో ఈమారు రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకున్నారు. ఈ క్రమంలో అతడిని మరో పోలీసు కాలితో తన్నాడన్న ఆరోపణ కూడా సంచలనం కలిగిస్తోంది.

Tirumala Venkateswara Swamy Assets: తిరుమల శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు.. బ్యాంకులో 11 టన్నుల బంగారం.. టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం.. తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

ఇంచార్జ్ స్పందన ఏంటంటే?

హోంగార్డు ఆరోపణలపై భోగ్‌పూర్ స్టేషన్ ఇంచార్జ్ స్పందించారు. ఓ వివాదానికి సంబంధించి హోంగార్డు ఓ యువకుడిని అరెస్టు చేసి స్టేషన్‌ కు తీసుకొచ్చాడని, అయితే అతడిని బెయిల్‌పై విడుదల చేశామని చెప్పారు.

Six Died Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి, తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషషియా ప్రకటన