Porn Passport: స్పెయిన్‌ లో పోర్న్‌ పాస్‌ పోర్ట్‌.. 18 ఏండ్లు నిండిన వారికి మాత్రమే.. ఎందుకు తీసుకొచ్చారు? ఉపయోగమేంటి?

విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ ఉండాలన్న విషయం తెలిసిందే. ఇది గుర్తింపు ద్రువీకరణ పత్రంగానూ సాయపడుతుంది. అయితే, స్పెయిన్‌ ప్రభుత్వం ‘పోర్న్‌ పాస్‌ పోర్ట్‌’ను కొత్తగా తీసుకొచ్చింది.

Porn . Image Used for Representational Purpose Only. (Photo Credits: File Image)

Newdelhi, July 7: విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ (Passport) ఉండాలన్న విషయం తెలిసిందే. ఇది గుర్తింపు ద్రువీకరణ పత్రంగానూ సాయపడుతుంది. అయితే, స్పెయిన్‌ (Spain) ప్రభుత్వం ‘పోర్న్‌ పాస్‌ పోర్ట్‌’ (Porn Passport)ను కొత్తగా తీసుకొచ్చింది. డిజిటల్‌ వాలెట్‌ బీటాగా పిలుస్తున్న ఈ పోర్న్‌ పాస్‌ పోర్టును 18 ఏండ్లు పైబడిన వారికి అందిస్తారు. ఈ పాస్‌ పోర్ట్‌ కింద నెలకు 30 పోర్న్‌ క్రెడిట్స్‌ ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. వీటితో పోర్న్‌ సైట్లను వీక్షించవచ్చు. క్రెడిట్స్‌ ఖర్చయిపోతే, అదనపు క్రెడిట్స్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని కూడా ఉచితంగానే అందిస్తారు.

వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి

స్వచ్చందమే

అశ్లీల మాధ్యమాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడం, పోర్న్‌ వ్యసనాన్ని తగ్గించడం, ఆన్‌ లైన్‌ లైంగిక వేధింపుల కట్టడి కోసమే పోర్న్‌ పాస్‌ పోర్ట్‌ ను తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. 18 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే పోర్న్‌ సైట్లలో ప్రవేశాన్ని కల్పించడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే, తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఈ నిబంధనలు ఉన్నాయని స్థానికులు ఈ పాస్ పోర్ట్ జారీని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇది స్వచ్చందమేనని అధికారులు ప్రకటించారు.

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్‌, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు

Share Now

Advertisement
Share Now
Advertisement