Vij, Aug 28: ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరగా ఓకే చెప్పడంతో జగన్ యుకే టూర్ ఖరారైంది. సెప్టెంబర్ 3న ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ వెళ్లనున్నారు జగన్. సెప్టెంబర్ 3 నుండి 25 వరకు యూకేలో పర్యటించనున్నారు.
విదేశీ పర్యటనకు వెళ్లేముందు టూర్‌కు సంబంధించిన వివరాలు, ఫోన్ నెంబర్, ఈ మెయిన్ వంటివి న్యాయస్థానంతోపాటు సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక జగన్ విదేశీ టూర్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి.
ఈ ఏడాది జగన్ విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు జగన్. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. అలాగే జగన్ కొత్త పాస్‌పోర్టుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
అక్రమాస్తుల కేసులో ఏ1గా జగన్,ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీరు విదేశాలకు వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సైతం విదేశీ టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా?, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్, బన్నీకి అసలు ఫ్యాన్సే లేరని మండిపాటు, స్థాయిని మించి మాట్లాడొద్దని చురకలు
ఇక జగన్ తన విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వైసీపీ మద్దతుదారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న వైఎస్ వర్దంతి వేడుకల్లో పాల్గొని అక్కడి ఆ తర్వాత యుకేకు బయలుదేరనున్నారు జగన్.
వైసీపీ అధికారం కొల్పోవడంతో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చారు జగన్. కడప జిల్లా బాధ్యతలను రవీంద్రనాథ్ రెడ్డికి గడికోట శ్రీకాంత్‌రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే మరో కీలకనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా అనుబంధ విభాగాలను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు.