Crime In AP: ప్రేమ పేరుతో మహిళా టీచర్‌ను లొంగదీసుకొని, ఆమెతో శృంగారం చేసి, ఫోటోలు వీడియోలు తీసి బెదిరిస్తున్న కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

ఈ సందర్భంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి, గత సంవత్సరం సెప్టెంబర్ లో ఇద్దరు విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు సన్నిహితంగా శారీరకంగా కలిశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

విజయవాడ, మార్చి 8: చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడు అయ్యాడు. తోటి ఉపాధ్యాయురాలిని లోబర్చుకొని ఏకంగా ఆమె అశ్లీల చిత్రాలను తీశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను, ఫోటోలను తమ స్నేహితులకు బంధువులకు పంపిస్తానని బెదిరిస్తూ తన కోరిక తీర్చుకున్నాడు. చివరికి ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం విశాఖ జిల్లాలోని రావికమతం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిందితుడు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

గత సంవత్సరం నుంచి విజయవాడ సమీపం ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు హాజరు అవుతున్నాడు. అయితే ఆ తరగతులకు జంగారెడ్డిగూడెం నుంచి బాధితురాలు టీచర్ శిక్షణకు వచ్చారు. ఆమె వివాహిత.. భర్త శారీరకంగా వేధిస్తూ ఉండటంతో తీవ్రంగా మనో వేదనకు గురైంది. ఈ విషయాన్ని శిక్షణా తరగతుల్లో పరిచయమైన నిందితుడుకి చెప్పింది. ఈ సందర్భంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి, గత సంవత్సరం సెప్టెంబర్ లో ఇద్దరు విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు సన్నిహితంగా శారీరకంగా కలిశారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..

ఈ సందర్భంలోనే నిందితుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బట్టలు లేకుండా ఫోటోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. అలాగే ఆ ఉపాధ్యాయురాలి మొబైల్ ఫోన్ లో ఆమెకు తెలియకుండా ఒక రహస్య యాప్ ని డౌన్లోడ్ చేసి, ఆమె ఫోన్ తో ఏం చేస్తుందో అంతా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఈ విధంగా అశ్లీల చిత్రాలను వీడియోలను బంధువులకు స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తూ ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి కోరిక తీర్చుకునే వాడు. ఈ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఆ బాధితురాలు విజయవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఆయనను అరెస్టు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement