Dancing With Pistol: బాలీవుడ్ సినిమా పాటకు తుపాకీ పట్టుకుని తీహార్ జైలు అధికారి డ్యాన్స్.. వేటు వేసిన ఉన్నత అధికారులు (వీడియో)
వృతిధర్మం, విధులు, క్రమశిక్షణను మరిచి కొందరు విపరీత చర్యలకు తెగబడి చిక్కుల్లో పడతారు. ఇదీ అలాంటి ఘటనే. తుపాకీ పట్టుకుని బాలీవుడ్ సినిమా పాటకు డ్యాన్స్ చేసిన ఓ తీహార్ జైలు అధికారిపై తాజాగా వేటు పడింది.
Newdelhi, Aug 10: వృతిధర్మం, విధులు, క్రమశిక్షణను మరిచి కొందరు విపరీత చర్యలకు తెగబడి చిక్కుల్లో పడతారు. ఇదీ అలాంటి ఘటనే. తుపాకీ పట్టుకుని బాలీవుడ్ సినిమా పాటకు డ్యాన్స్ (Dancing With Pistol) చేసిన ఓ తీహార్ జైలు (Tihar Jail) అధికారిపై తాజాగా వేటు పడింది. వైరల్ గా మారిన ఆయన డ్యాన్స్ వీడియో అటు తిరిగీ.. ఇటు తిరిగీ చివరకు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ నృత్యశిరోమణిపై ఈ సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏఎస్పీ దీపక్ శర్మ తీహార్ జైలు పరిధిలోని మాండోలి కారాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన దీపక్ శర్మ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు.
ప్రమాదకరంగా గురి పెడుతూ..
రివాల్వర్ ను చుట్టూ ఉన్న వారిపై ప్రమాదకరంగా గురిపెడుతున్నట్టు పోజు పెట్టి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఒకరినుంచి మరొకరికి షేర్ అవుతూ చివరకు జైళ్ల శాఖ దృష్టికి వెళ్లింది. ఘటనను సమీక్షించిన ఉన్నతాధికారులు దీపక్ శర్మను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్