Aman Sehrawat (Credits:X)

Newdelhi, Aug 10: పారిస్ ఒలింపిక్స్‌ లో (Paris Olympics 2024) మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ (Aman Sehrawat) రెజ్లింగ్‌ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు. భారత్‌ కు ఇది ఆరో పతకం. కాంస్య పతకం కోసం శుక్రవారం 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్‌ ను ఓడించి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు ఈ చిన్నోడు. ఈ పోటీల్లో భారత్ తరపున పోటీపడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్. అంతేకాదు ఒలింపిక్స్‌ లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన (21 సంవత్సరాల 24 రోజులు)భారతీయుడు కూడా ఇతడే.

పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్‌ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్ 

దివంగత తల్లిదండ్రులకు అంకితం

స్వతంత్ర భారతంలో తొలి పతకం అందుకున్న రెజ్లర్‌ గా కేడీ జాదవ్ పేరు రికార్డుల్లో నిలిచిపోయింది. 1952లో హెలింక్సిలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఆయన మెడల్ సాధించి ఈ ఘనత సాధించారు. ఇక, ఒలింపిక్స్‌ లో పతకం సాధించిన ఏడో భారత రెజ్లర్‌ గా అమన్ రికార్డులకెక్కాడు. ఈ పతకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితం ఇచ్చాడు.

భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం