Hyd, Aug 8: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఒలింపిక్స్ నుండి వైదొలగగా ప్రతి ఒక్కరిని ఈ నిర్ణయం నిరాశ పర్చింది.
తనపై వేసిన అనర్హత వేటును కొట్టివేయాలని క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని (సీఏఎస్) వినేశ్ ఫొగట్ కోరింది. తాను ఎక్కడా ఓవర్ వెయిట్ లో పోటీలో ఎవరితోనూ తలపడలేదని, అలాగే ఫైనల్స్ పోరులో ఓవర్ వెయిట్ తో పోటీకి మాత్రమే దిగలేనని తెలిపింది. ఫైనల్స్ లో తాను , ఆడిన ఆడకపోయినా సరే వెండి పతకం పొందేందుకు తాను అర్హురాలినని పేర్కొంది. ‘నాపై రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్ ఫోగాట్ గుడ్ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్ రెజ్లర్
ఇక ఫోగట్ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమె వాదనను సమర్థించింది. దీనిపై రేపు తుది తీర్పు ఇస్తామని తెలపగా అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యాయస్థానం నిర్ణయానికంటే ముందే రెజ్లింగ్ నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు ఫోగట్.