Train Guard Manhandles Disabled Person: దివ్యాంగుడి ట్రైన్ నుంచి తోసేసిన గార్డ్, సూప‌ర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినందుకు క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తి, బీహార్ లో వైర‌ల్ గా మారిన వీడియో

ఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. (Train Guard Manhandles Disabled Person) అతడి కాలర్‌ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral video) అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది

Samastipur Video

Samastipur, AUG 14:  ఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. (Train Guard Manhandles Disabled Person) అతడి కాలర్‌ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral video) అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. చేతి కర్రలపై ఆధారపడే దివ్యాంగుడైన వ్యక్తి ఆగస్ట్‌ 13న సమస్తిపూర్ నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్లేందుకు వైశాలి సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌లోకి ఎక్కాడు. అయితే రైలు గార్డు రామ్ ఆశిష్ దాస్‌ ఆ వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. వికలాంగుడి చొక్కా కాలర్‌ పట్టుకుని దుర్భాషలాడాడు.

 

ఆ తర్వాత ఆ వ్యక్తిని కంపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడు. దీని కోసం ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ను పిలిచాడు. అయితే ఈ సంఘటన వెనుక కారణం ఏమిటన్నది తెలియలేదు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దివ్యాంగుడి పట్ల దురుసుగా ప్రవర్శించిన గార్డు తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. మానవత్వం లేని ఆ రైల్వే గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement