UK: సహోద్యోగి ఫ్యాంట్ విప్పి అతడి పురుషాంగం పట్టుకున్న పోలీస్ ఆఫీసర్, ఇంత చిన్నదా అంటూ అందరి ముందు ఎగతాళి, సీరియస్ అయిన పై అధికారులు, పోలీసు అధికారి సస్పెండ్
ఓ పోలీసు అధికారి అనుచిత ప్రవర్తన.. అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సహోద్యోగి పురుషాంగం చిన్నగా (Colleague's Genitals) ఉందని ఎగతాళి చేయడంతో.. ఆ పోలీసు ఆఫీసర్‌ను విధుల నుంచి (British Cop Fired) తొలగించారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది.
Englang, June 21: ఇంగ్లండ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి అనుచిత ప్రవర్తన.. అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సహోద్యోగి పురుషాంగం చిన్నగా (Colleague's Genitals) ఉందని ఎగతాళి చేయడంతో.. ఆ పోలీసు ఆఫీసర్‌ను విధుల నుంచి (British Cop Fired) తొలగించారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది.
పోలీసు ఆఫీసర్ అడమ్ రీడ్స్ 2021లో డివైజెస్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలోనే ఓ కొత్త ఉద్యోగి విధుల్లో చేరాడు. అయితే కొత్త ఉద్యోగి ప్యాంట్‌ను బలవంతంగా విప్పి.. అతని పురుషాంగాన్ని అడమ్ రీడ్స్ (Touching Colleague's Genitals) పట్టుకున్నాడు. పురుషాంగం చిన్నదిగా ఉందని అందరి ముందే ఎగతాళి చేశాడు. ఈ ఘటనను పోలీసు డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా తీసుకుంది. కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐదు రోజుల విచారణ అనంతరం అడమ్ రీడ్స్‌ను విధుల్లో నుంచి తొలగిస్తూ తీర్పు వెల్లడైంది. అడమ్ రీడ్స్ వైఖరిపై విల్ట్‌షైర్ డిప్యూటీ చీఫ్ కానిస్టేబుల్ పాల్ మిల్స్ స్పందించారు. అడమ్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, సహోద్యోగి గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించాడని పేర్కొన్నారు. రీడ్స్ ప్రవర్తన అవాంఛిత శృంగారానికి ప్రయత్నించినట్లు ఉందన్నారు.
పోలీసులు విచారణలో.. ఆడమ్ తన తప్పును అంగీకరించాడు. తాను కావాలని... చేయలేదని సరదాగా ఆటపట్టించడం కోసం చేశానని అన్నాడు. ఈ ఘటన ఇంత పెద్దది అవుతుందని అనుకొలేదని అధికారులకు తన వాదన వినిపించాడు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలను అందరిముందు ప్రస్తావించి, అతనికి ఇబ్బందులు గురిచేసినందుకు గాను ఉద్యోగంలో నుంచి తొలగించారు. అదే విధంగా, అతను యూకేలో మరోసారి ఏ పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
దీనిపై డిప్యూటీ చీఫ్ పోలీసు అధికారి మాట్లాడుతూ..నిందితుడు .. ఆడమ్ రీడ్ చర్యలు మన్నించ తగినవి కావు. అవి పూర్తిగా.. అతని సహోద్యోగి గౌరవానికి భంగం కలిగించాయి. ఈ చర్యల వలన అతను ఎంతో మనోవేదనకు గురయ్యాడు. అతని చర్యలు అసహాజ లైంగిక ప్రవర్తనతో సమానం.విల్ట్‌షైర్ పోలీసుల నుండి ఆడమ్ రీడ్‌ను తొలగించాలని LQC తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఫోర్స్ చేత ఆమోదించబడింది అని అధికారి మిల్స్ చెప్పారు. ప్రస్తుతం అతను ఇప్పుడు యూకేలోని.. జాతీయ నిషేధిత జాబితాలో ఉంచబడతాడు. అతను భవిష్యత్తులో పోలీసింగ్‌లో పని చేయలేడని నిర్ధారిస్తుందని అధికారి మిల్స్ స్పష్టం చేశారు.