Patient Gains Fully Functional Penis After Microvascular Surgery at Hyderabad(X)

Hyd, Feb 7:  వైద్య చరిత్రలో ఇదో అద్భుతం. చిన్నతనంలోనే పురుషాంగాన్ని కొల్పోయిన(Penile Reconstruction) యువకుడికి శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ పురుషాంగాన్ని అమర్చారు డాక్టర్లు. ఈ శస్త్ర చికిత్స తర్వాత యువకుడు మూత్ర విసర్జన చేయడమే కాదు లైంగిక సామర్ధ్యం లభించడం విశేషం. మెడికోవర్ ఆసుపత్రి(Medi cover Hospitals) డాక్టర్లు చేసిన ఈ అద్భుతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏడాదిన్నర కిందట జరిగిన శస్త్రచికిత్సతో యువకుడు పూర్తిగా కోలుకున్నాడని మేడికోవర్ డాక్టర్లు తెలిపారు. అంగ స్తంభన కోసం పినైల్‌ ఇంప్లాంట్‌ ఏర్పాటుచేశామని .. రెండు దశల్లో జరిగిన ఈ చికిత్స విజయవంతమైందని వెల్లడించారు.

సోమాలియా(Somalian Patient )కు చెందిన 20 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ జరిగింది.. అయితే ఆ సమయంలో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో అతడికి పురుషాంగాన్ని తొలగించి, వృషణాల కింద నుంచి మూత్రం వెళ్లేలా మార్గం ఏర్పాటుచేశారని చెప్పారు. అయితే18 ఏళ్లు వచ్చే నాటికి మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో బాధితుడు మెడికవర్‌ ఆసుపత్రిని సంప్రదించాడు.  వీడియో ఇదిగో, తలుపు గడి వేసుకుని ఉరివేసుకునేందుకు ప్రయత్నించిన మహిళ,చాకచక్యంగా కాపాడిన రాచకొండ పోలీసులు

డాక్టర్లు తొలుత మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా సర్జరీ చేసి తర్వాత పురుషాంగాన్ని పునఃసృష్టించి అతడికి అమర్చారు. మైక్రోవాస్క్యులర్‌ సర్జరీ(Microvascular Surgery) ద్వారా రేడియల్‌ ఆర్టెరీ ఫోర్‌ఆర్మ్‌ ఫ్లాప్‌ విధానంలో తొలుత యువకుడి ముంజేయి వద్ద పురుషాంగాన్ని రూపొందించారు. అనంతరం రక్తనాళాలతో దానికి అనుసంధానంచేశారు.

ఈ ప్రయోగం ఫలించడంతో శస్త్రచికిత్స ద్వారా వృషణాల పైభాగంలో దానిని అతికించారు. పురుషాంగం నుంచి మూత్రవిసర్జన జరిగేలా గొట్టాన్ని అమర్చి... మూత్రాశయానికి అనుసంధానం చేశారు. దీంతో ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇకపై ఆ యువకుడు పెళ్లి చేసుకుని హాయిగా సంసార జీవితం గడపవచ్చని డాక్టర్లు భరోసా ఇచ్చారు. అయితే, గతంలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వీర్యగ్రంథి దెబ్బతినడం వల్ల వీర్యం మాత్రం ఉత్పత్తి జరగదని వెల్లడించారు.

శస్త్రచికిత్స విధానం:

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ క్లిష్టమైన మైక్రోవాస్కులర్ సర్జరీని

డాక్టర్ ఏవి రవి కుమార్ (సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ & అండ్రాలజిస్ట్)

డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ (కన్సల్టెంట్ రీకన్స్ట్రక్చివ్ & కాస్మెటిక్ సర్జన్) నేతృత్వంలో నిర్వహించారు.

మొదటి దశలో – మూత్రనాళాన్ని శుభ్రపరిచి ఇన్ఫెక్షన్‌ను తొలగించారు.

రోగి స్థిరపడిన తర్వాత – శిశ్న పునర్నిర్మాణానికి ముందు భుజం చర్మాన్ని ఉపయోగించారు. ఈ పద్ధతి శిశ్న చర్మానికి సమానంగా ఉంటుంది, అందువల్ల సర్జరీ విజయవంతమైంది.

పూర్తి శస్త్రచికిత్స వివరాలు:

10 గంటల పాటు శస్త్రచికిత్స కొనసాగింది.

అరేటరీలు (ధమనులు), శిరలు (నరాలు) మళ్లీ అనుసంధానించారు.

మూత్రనాళాన్ని పునర్నిర్మించడానికి స్క్రోటల్ భాగాన్ని ఉపయోగించారు.

పెన్నైల్ ఇంప్లాంట్‌ను అమర్చి, సహజమైన ఉద్దీపన (erection) సాధ్యమయ్యేలా చేశారు.