రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు సకాలంలో స్పందించి ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు. ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందంటూ ఈ రోజు ఉదయం 9.45 గంటలకు బాలాపూర్ పోలీసులకు డయల్100 ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో బాలాపూర్ పీఎస్ లో విధుల్లో ఉన్న రాజు రెడ్డి, ఎస్.తరుణ్ అనే కానిస్టేబుళ్లు 5 నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడికి వెళ్లి చూసిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు... ఓ యువతి గది లోపలి నుంచి గడియ పెట్టుకున్నట్టు గుర్తించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తలుపులు బద్దలు కొట్టి ఆ యువతిని కాపాడారు. ఆమె ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపజేశాక... ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాచకొండ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల సత్వర స్పందన, వారి అంకితభావం ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టిందని ఆ పోస్టులో కొనియాడారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు చేయకుండా, తమకు ఇష్టమైన వారితో మాట్లాడి, వారి సాయం తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్100కి కాల్ చేయవచ్చని, 87126 62111 నెంబరు ద్వారా వాట్సాప్ లో సంప్రదించవచ్చని ఆ పోస్టులో సూచించారు.
Rachakonda police save a young woman who attempted suicide
🚨 Swift Action by Balapur Police Saves a Life 🚨
Today, at around 09:45 AM, @BalapurPS Police received a #Dial100 call about a #Suicide_Attempt at Balapur Village. Acting swiftly, BC duty staff PC 13118 Raju Reddy and PC 13620 S. Tharun reached the location within five minutes.… pic.twitter.com/HttSQJvil1
— Rachakonda Police (@RachakondaCop) February 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)