Rishi Sunak's Daughter Anoushka Sunak Performs Kuchipudi: యూకే ప్రధాని రిషీ సునాక్ కూతురు కూచిపూడి డ్యాన్స్.. అంతర్జాతీయ కూచిపూడి వేడుకల్లో ప్రదర్శన.. వీడియో ఇదిగో!

బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ లండ‌న్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్ల‌ల‌తో క‌లిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు.

Anoushka Sunak (Credits: Twitter)

London, Nov 26: బ్రిట‌న్ ప్ర‌ధాని (Britain Prime Minister) రిషి సునాక్ కూతురు (Daughter of Rishi Sunak) అనౌష్క సునాక్ (Anoushka Sunak) లండ‌న్‌లో (London) జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కూచిపూడి నృత్య (Kuchipudi Dance)  ప్ర‌ద‌ర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్ల‌ల‌తో క‌లిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. ఆ పిల్ల‌లు అంద‌రూ రేంజ్‌-ఇంట‌ర్నేష‌న‌ల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివ‌ల్‌ 2022 (Range International Kuchipudi Dance Fest 2022) లో పాల్గొన్నారు.

తట్టు సోకిన వ్యక్తి ద్వారా మరో 18 మందికి వైరస్ సోకే ప్రమాదం.. డబ్లూహెచ్ వో వెల్లడించిన మరిన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే?

నాలుగేళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ యువతి వీల్ చెయిర్ లోనే డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. యూకే ప్రధాని పదవిని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కృష్ణ సునాక్, అనౌష్క సునాక్.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement