Man Suicide in Temple: ఆలయంలో గొంతు కోసుకుని భక్తుడు ఆత్మహత్య.. మధ్యప్రదేశ్ లో ఘటన
రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని చూసి స్థానికులు షాక్ అయ్యారు.
Bhopal, Jan 16: ఆలయంలో (Temple) గొంతు కోసుకుని (Slits Throat) ఓ భక్తుడు (Devotee) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మెహర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడిని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన లల్లారామ్(37)గా గుర్తించారు. భక్తుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఈ ఆలయంలో కొంత మంది భక్తులు తమ నాలుకలను కోసుకునేందుకు యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Indigo Runway Dinner: రన్ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)