Girls Fighting Viral Video: క్యాంటీన్‌లో కుర్చీల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న నలుగురు అమ్మాయిలు, రోడ్డు మీదకెక్కి బూతులు తిడుతూ ఫైటింగ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అమ్మాయిల రచ్చ

నాసిక్‌లో (Nashik college) ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు క్లాసుల అనంతరం క్యాంటీన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో క్యాంటీన్‌లో కుర్చీల విషయంలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. దీంతో, అక్కడే వాదనకు దిగారు.

Screen Garb from Nashik Viral Video Credit @ Twitter

Nashik, NOV 20: అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు కాస్తంత సౌమ్యంగా ఉంటారు, గొడవల జోలికి అస్సలు వెళ్లరు, డీసెంట్ గా బిహేవ్ చేస్తారు, సెన్సిటివ్ గా ఉంటారు, రోడ్డున పడి రచ్చ చేయరనే అభిప్రాయం ఇంకా కొంతమంది జనాల్లో ఉంది. అయితే, ఆ అభిప్రాయం తప్పు అనేలా చేస్తున్నారు కొందరు అమ్మాయిలు. తమ ప్రవర్తనతో సభ్య సమాజం విస్తుపోయేలా చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. వామ్మో.. వీళ్లసలు చదువుకునే అమ్మాయిలా? వీధి రౌడీలా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. మహారాష్ట్రలో నలుగురు అమ్మాయిలు (Four Girls Fighting) నడిరోడ్డుపై తన్నుకున్నారు. తన్నుకోవడం అంటే అలా ఇలా కాదండోయ్.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. జట్టు పట్టుకుని మరీ తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

క్యాంటీన్ లో కుర్చీల కోసం వీరు తన్నుకున్నారని తెలిసి అంతా విస్తుపోతున్నారు. నాసిక్‌లో (Nashik college) ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు క్లాసుల అనంతరం క్యాంటీన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో క్యాంటీన్‌లో కుర్చీల విషయంలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. దీంతో, అక్కడే వాదనకు దిగారు. ఈ వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లింది. ఇంతలో క్యాంటీన్‌ సిబ్బంది వారిని వారించి అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. బయటకు వచ్చిన నలుగురు అమ్మాయిలు మరోసారి వాదులాడుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన విద్యార్థినిలు తాము రోడ్డుపై ఉన్నామనే విషయం మరిచిపోయి దారుణంగా బూతులు తిట్టుకున్నారు (Scolding). అంతేనా.. జట్లు పట్టుకుని కొట్టుకున్నారు.

Shraddha Walker Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం, సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ అసలు వాస్తవాలు, యువతిని 35 ముక్కలు చేసిన కేసులో సంచలన నిజాలు..

ముగ్గురు అమ్మాయిలు నాలుగో అమ్మాయిని రౌండప్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయి జట్టు పట్టుకున్నారు. మరో అమ్మాయి ఆ అమ్మాయిపై దాడి చేసింది. పిచ్చ కొట్టుడు కొట్టింది. అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థులు వారిని వారించినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా అమ్మాయిలు తన్నుకున్నారు. కొందరేమో దీన్ని సినిమా చూసినట్లుగా చూశారు. ఇంకా కొట్టుకోండి అన్నట్టు ప్రోత్సహించారు.

Cat in Salon: సెలూన్ లో పిల్లికి కటింగ్ చేసిన హెయిర్ డ్రెస్సర్.. తల, మీసాలు కట్ చేసిన వైనం.. ఎటూ కదలకుండా కటింగ్ చేయించుకున్న పిల్లి.. వీడియో చూసి నెటిజన్ల ఫిదా 

కాగా, అమ్మాయిల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. వామ్మో.. వీళ్లసలు చదువుకునే అమ్మాయిలా? లేక వీధి రౌడీలా? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అమ్మాయిలేంటి? మరీ ఇలా తయ్యారయ్యారు అని తల పట్టుకుంటున్నారు.