శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన వివరాలతో మృతురాలి శరీర భాగాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే గతంలో దొరికిన గుర్తు తెలియని మృతదేహాలు, శరీర భాగాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కాగా.. తాజాగా ఓ సీసీ టీ ఫుటేజీని కూడా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధ శరీర భాగాలను తరలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మే 18న ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరం లోనే ఉన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్‌లో కొన్ని గుర్తు తెలియని శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. పాండవ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రామ్‌లీలా మైదానానికి సమీపంలో చెత్తకుప్పలో కుళ్లి పోయిన స్థితిలో ఉన్న మనిషి తలను చేతులను పోలీసులు, ఫోరెన్సిక్ బృందం గుర్తించారు.
#WATCH | Shraddha murder case: CCTV visuals of Aftab carrying bag at a street outside his house surface from October 18 pic.twitter.com/S2JJUippEr
— ANI (@ANI) November 19, 2022
అక్కడ పడేయడానికి ముందు ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపర్చినట్టు అప్పటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.