Newdelhi, Nov 19: ఓ హెయిర్ డ్రెస్సర్ (Hair Dresser) తెల్లగా ముద్దుగా ఉన్న పిల్లి (Cat) తలకు కటింగ్ (Cutting) చేశాడు. దాని మీసాలు కూడా కత్తిరించాడు. ఆ పిల్లి కూడా సాధారణ కస్టమర్ మాదిరిగానే ఓపిగ్గా కూర్చుంది. దువ్వెన పెట్టి కటింగ్ చేస్తుండగా.. హాయిగా కునుకు కూడా తీసింది. సోషల్ మీడియాలో (Social Media) ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 20 లక్షలకు వైగా వ్యూస్ లభించాయి. పిల్లి చాలా బాగుందని, హెయిర్ కట్ తర్వాత అది మరింత క్యూట్ గా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను తాను పదే పదే చూస్తున్నానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. హెయిర్ సెలూన్ లో తన కంటే ఈ పిల్లే బాగా కూర్చుందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)