H3N2 Influenza: హెచ్3ఎన్2 వైరస్ అంటే ఏంటి? అది సోకకుండా ఉండేందుకు ఏం చేయాలి?

మొన్నటి వరకూ కరోనాతో కుదేలైన ప్రజలను మరో వైరస్ భయపెడుతుంది. వేసవికాలంలో అడుగు పెడుతున్న ఈ సమయంలో గత కొంతకాలంగా కొవిడ్ తరహా లక్షణాలున్న ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ రకం కేసులు పెరుగుతున్నాయి.

H3N2 Influenza | Representational Image (Credits: Twitter)

Newdelhi, March 10: మొన్నటి వరకూ కరోనాతో (Corona) కుదేలైన ప్రజలను మరో వైరస్ (Virus) భయపెడుతుంది.  వేసవికాలంలో (Summer) అడుగు పెడుతున్న ఈ సమయంలో గత కొంతకాలంగా కొవిడ్ తరహా లక్షణాలున్న ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 (H3N2 Influenza) వైరస్ రకం కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ వైరస్ ఏంటి? ఎలా వ్యాప్తి చెందుతుంది? నివారణ మార్గాలు ఏమిటో చూద్దాం..

ఏమిటీ వైరస్?

హెచ్1ఎన్1 వైరస్ వల్ల గతంలో ఒక మహమ్మారిని చవి చూశాం. ఇప్పుడు దానికి సంబంధించిన సాధారణ వేరియంటే హెచ్3 ఎన్2 . దానిలో స్వల్పస్థాయిలో ఉత్పరివర్తనలు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు సులభంగా దీని ప్రభావానికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో చేరికలు భారీస్థాయిలో లేకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫ్లూని "హాంకాంగ్ ఫ్లూ" అని కూడా పిలుస్తారు, ఇది ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ యొక్క ఉప రకం, ఇది మానవులలో శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతుంది.

జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర.. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్లమెంట్.. మావో జెడాంగ్ తర్వాత శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు

కేసులు పెరగడానికి కారణాలు?

కేసులు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వాతావరణంలో వచ్చే మార్పులు, అలాగే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించక పోవడం ఇందుకు కారణమన్నారు.

ఫ్లూ లక్షణాలివే…

గత రెండు మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఈ హెచ్3 ఎన్2 రకం ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీని ప్రధాన లక్షణాలు.. ఎడతెరపి లేని దగ్గు, జ్వరం. దీంతోపాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు.

పాఠశాల విద్యార్థులకు ‘రాగిజావ’ కార్యక్రమం రెండోసారీ వాయిదా.. జగనన్న గోరుముద్ద ద్వారా 21 నుంచి అందించాలని తాజాగా నిర్ణయం.. వాయిదాకు కారణం ఏంటంటే?

వ్యాప్తి ఎలా? జాగ్రత్తలు ఏమిటి?

ఈ ఫ్లూ తుంపర్ల రూపంలో కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తుందని, ప్రతి ఏడాది ఈ సమయంలో వైరస్‌లో ఉత్పరివర్తనలు చోటు చేసుకుంటాయని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు మరింత జాగ్రత్త వహించాలన్నారు. ముఖానికి మాస్క్ లు ధరించాలి అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now