Beijing, March 10: చైనా అధ్యక్షుడు (China President) జిన్‌పింగ్ (Jinping) చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి (Third term) ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 3 వేల మంది ఉన్న చైనా రబ్బర్ స్టాంప్ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) (NPC) జిన్‌పింగ్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్ష పోటీలో మరొకరు లేకపోవడంతో జిన్‌పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ వార్తాసంస్థ ‘రాయిటర్స్’ తెలిపింది. అలాగే, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గానూ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. తాజా ఎన్నికతో జిన్‌పింగ్ జీవితాంతం చైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.
Xi Jinping Elected Chinese President For Historic 3rd Term https://t.co/dQM3kUXVeM pic.twitter.com/hIMEGv4X8s
— NDTV (@ndtv) March 10, 2023
పట్టు సాధించారు ఇలా..
గతేడాది అక్టోబరులో జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. వరుసగా ఎన్నికవుతున్న ఆయన పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. ఫలితంగా మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, దేశానికి ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేయాలన్న నిబంధనను 2018లో జిన్‌పింగ్ ఎత్తివేశారు. ఫలితంగా ఆయన రిటైర్ అయ్యే వరకు లేదంటే మరణించే వరకు, లేదంటే బహిష్కృతయ్యే వరకు ఆయనే చైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.