Vijayawada, March 10: మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్దలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) పాఠశాలల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించాలనుకున్న రాగిజావ పథకం (Ragi Malt Programme) రెండోసారి వాయిదా పడింది. విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ నుంచి విద్యార్థులకు రాగిజావను పంపిణీ చేయనున్నట్టు తొలుత ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈరోజుకి వాయిదా వేసింది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ రాగిజావ కార్యక్రమాన్ని ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు సమాచారం ఇచ్చారు.
వాయిదాకు కారణం ఏంటంటే?
పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలను తగ్గించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకంలో రాగి జావను కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రాగి జావను ఎలా తయారు చేయాలి? అందుకు కావాల్సిన వస్తువులేంటి? రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి అన్న వివరాలను బుధవారమే విద్యాశాఖ విడుదల చేసింది. దీంతో కార్యక్రమ అమలులో జాప్యం నెలకొన్నధి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉండటం కార్యక్రమం వాయిదాకు మరో కారణంగా తెలుస్తున్నది.