TSRTC MD VC Sajjanar (Photo-Twitter)

టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ స‌జ్జ‌నార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీ ప్రగతిపథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను (budget-friendly ticketing offers) ప్రవేశపెట్టారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్ర‌యాణించే వారి కోసం ఆర్టీసీ ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట సరికొత్త ఆఫ‌ర్ల‌ను ప్యాసింజర్లకు కోసం తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఆవిష్క‌రించారు. టీ-6 ఆఫర్‌ ఏంటంటే.. మ‌హిళ‌లు, సీనియ‌ర్ సిటిజ‌న్ల టీ-6ని ఉపయోగించుకోవచ్చు. వీళ్లు రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. 6 గంట‌ల పాటు (అనగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) సిటీ ఆర్డినరీ బస్‌ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బ‌స్సుల్లో ప్ర‌యాణించవచ్చు.

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు, ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు

ఇక ఎఫ్-24 ఆఫర్ విషయానికి వస్తే.. కుటుంబ స‌భ్యులు, లేదా స్నేహితుల కోసం ఈ టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది శనివారం, ఆదివారం, సెలవు దినాలలో వర్తిస్తుంది. రూ. 300 చెల్లించి ఈ టికెట్‌పై 4గురు వ్య‌క్తులు రోజంతా సిటీ ఆర్డినరీ బస్‌ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పించారు.

టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ ఇదిగో, మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష, మార్చి 6వ తేదీ నుంచి మే 6 వ‌ర‌కు దరఖాస్తుకు అవకాశం

గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని సజ్జనార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. వారిలో 55.50 లక్షల మంది T-24 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు.