New Virus In China (Credits: X)

Newdelhi, Jan 3: కరోనా (Corona) సృష్టించిన విలయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న ప్రజలకు మరో వైరస్ (New Virus In China) భయాన్ని కలిగిస్తున్నది. చైనాలో కొత్త వైరస్ వార్తలు కలకలం రేపుతున్నాయి. దీని బారినపడుతున్న వేలాదిమంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త వైరస్‌ ను ‘హ్యూమన్ మెటానియా’(హెచ్ఎంపీవీ) గా చెబుతున్నారు. ఇది శరవేగంగా విస్తరిస్తోందని, బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి. అంతేకాదు, ఈ వైరస్‌ తోపాటు ఇన్‌ ఫ్ల్యూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌ లు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు.

సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత

Here's Video:

కొవిడ్ తరహా లక్షణాలే

హ్యూమన్ మెటానియా వైరస్ సోకుతున్న వారిలో కొవిడ్ లక్షణాలే కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ఇది ఎలా సోకుతుంది? చికిత్స ఏమిటి? అనే దానిపై మరింత స్పష్టత త్వరలో రానున్నట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు.

నూతన సంవత్సరం... క్వీన్స్‌లో విషాదం, ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు..11 మందికి గాయాలు...పరారీలో అనుమానితులు!