Russia, JAN 02: సిరియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ (Bashar al-Assad).. స్వదేశాన్ని వీడి రష్యాలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

Mass Shooting In Queens: నూతన సంవత్సరం... క్వీన్స్‌లో విషాదం, ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు..11 మందికి గాయాలు...పరారీలో అనుమానితులు!  

పరిస్థితి క్షీణించడంతో వెంటనే ఆయనకు వైద్య సహాయం అందించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల్లో విషపదార్థాల ఆనవాళ్లు కనిపించినట్లు సమాచారం. అయితే, దీనిపై రష్యా అధికారుల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.