Woman Washes Naan: రొట్టెను కూడా బట్టలు ఉతికినట్లు కుళాయి నీటి కింద కడిగిన ఆదర్శ మహిళ, జనాలు ఇలా కూడా ఉంటారా అని అవాక్కయిన జనం, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో.. మీరూ చూసేయండి!

Woman Washes Naan Viral Video | Pic: Instagram Screengrab

Woman Washes Naan: ఒక మహిళ రాత్రి భోజనంలో తినగా మిగిలిపోయిన రొట్టెలను ఉదయం మళ్లీ వేడి చేసుకొని చికెన్ బిహారీ బోటి కూరలో నంజుకొని తింది. రాత్రి మిగిలిన భోజనం ఉదయం పూట తింటే దాని రుచి పది రేట్లు పెరుగుతుంది, దీనిని ఎవరైనా కాదంటే కొట్టేస్తానంటూ చెప్పింది.

ఇందులో తప్పేముంది, వింతేముంది అని అనుకోవచ్చు. సాధారణంగా చాలా మంది రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం అల్పాహారంగా తింటారు కూడా. కానీ ఈ మహిళ చేసిన ఓ వింత పని ఇప్పుడు చాలా మందికి విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది..? మీకు తెలియాలి.. తెలిసి తీరాలి అంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాలి.

అలిషయ్ అనే మహిళ రాత్రి మిగిలిన నాన్ (రొట్టె) ను తీసుకొని దానిని కుళాయి నీటి కింద శుభ్రంగా కడిగింది. ఆపై దానిని పెనం మీద వేసి వేడి చేసుకొని తినేసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అంతా బాగానే ఉంది కానీ రొట్టెలను నీళ్లలో కడగటం ఏంటంటూ కొందరు ఎగతాళిగా చేస్తున్నట్లు కమెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వారు ఎక్కడెక్కడి నుంచి వస్తారురా బాబు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Woman Washes Naan Roti- Viral Video

https://www.instagram.com/everythingalishay/p/C1Z5L7NIHc7/

ట్రోలింగ్ ఎక్కువ అవడంతో ఆ మహిళ నీటిలో కడగటాన్ని సమర్థించుకుంది. రాత్రి మిగిలిపోయిన రొట్టెలను నీటిలో కడగడం వలన అవి మరింత మృదువుగా, టేస్టీగా మారతాయని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఆగటం లేదు. ఒకరైతే, 'అవును నీటిలో కడిగిన రొట్టె ముక్క, కుక్క నాకిన బొక్క చాలా రుచికరంగా ఉంటాయి' అంటూ ఫన్నీగా కమెంట్స్ పెడుతున్నారు.

అయితే కొందరు యూజర్లు మాత్రం రొట్టెను నీటిలో కడగటాన్ని సమర్థిస్తున్నారు. ఆ టెక్నిక్ ఇకపై తాము అనుసరిస్తామని ఒక యూజర్ చెప్పగా.. రొట్టెను నీటితో తడపడం వింతేమి కాదు, జర్మనీ దేశంలో చాలా మంది అలాగే రొట్టెను నీటిలో తడిపై ఆపై ఓవెన్ లో వేడి చేస్కొని తింటారు అని మరో యూజర్ తెలిపారు.

మరి మీరేమంటారు? కమెంట్ చేయండి, వీలైతే మీరు కూడా రొట్టెలతో పాటు అన్నం ఇతర ఆహార పదార్థాలను కూడా నీటిలో కడిగి మళ్లీ వేడి చేసుకొని తినండి, సరికొత్త ట్రెండ్ సెట్ చేయండి, సోషల్ మీడియాలో వైరల్ అయిపోండి.