Arundhati Nair Hospitalized: ఐసీయూలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న ప్రముఖ నటి, రోడ్డు ప్రమాదానికి గురైన మళయాళి హీరోయిన్‌ అరుంధతి నాయర్‌

ప్రముఖ మళయాళి హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని నటి గోపిక అనిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

Arundhati Nair | Image:Arundhati Nair/Instagram

ప్రముఖ మళయాళి హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని నటి గోపిక అనిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది.ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

నటి గోపిక అనిల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ... అరుంధతి వెంటిలేటర్‌పై పోరాడుతోంది. ఆమె కుటుంబానికి ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదు. మా వంతు మేము సాయం చేశాం. కానీ అది సరిపోవడం లేదు. మీరు కూడా తోచినంత సాయం చేస్తే అది ఆమె మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది.

కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి నాయర్‌. ఒట్టకోరు కాముకన్‌ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది.విరుమాండికుమ్‌ శివానందికమ్‌, సైతాన్‌, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. పద్మిని, డోంట్‌ థింక్‌ అనే వెబ్‌ సిరీస్‌ల్లోనూ యాక్ట్‌ చేసింది

Here's News

 

View this post on Instagram

 

A post shared by Gopika Anil (@gops_gopikaanil)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement