Lyricist Chandrabose: నాటు నాటు పాటకు మరో అంతర్జాతీయ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును అందుకున్న చంద్రబోస్
నాటు నాటు పాట అంతర్జాతీయంగా ఇప్పటికే మారుమోగిపోతుంది మరో కొద్ది గంటల్లో ఈ పాట ఆస్కార్ వేదికపై అవార్డు అందుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ప్రార్ధనలు చేస్తున్నారు.
నాటు నాటు పాట అంతర్జాతీయంగా ఇప్పటికే మారుమోగిపోతుంది మరో కొద్ది గంటల్లో ఈ పాట ఆస్కార్ వేదికపై అవార్డు అందుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ప్రార్ధనలు చేస్తున్నారు. అయితే ఆ పాట రచయిత చంద్రబోస్ మాత్రం మరో అంతర్జాతీయ అవార్డును పొంది అందరి ప్రశంసలు అందుకున్నారు రచయిత చంద్రబోస్ క్రిటిక్స్ చాయిస్ అవార్డుతోపాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును తాజాగా స్వీకరించినట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని చంద్రబోస్ తన ట్విట్టర్ లో ప్రకటించారు. ఇదిలా ఉంటే మరికొద్దిసేపట్లో నాటు నాటు పాటకు ఆస్కార్ వేదికపై చోటు దక్కబోతుందని అటు తెలుగు సినిమా అభిమానులతో పాటు భారతీయ సినిమా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తమ కుటుంబాలతో సహా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు చేరుకున్నారు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)