Dangerous: రాంగోపాల్ వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్, స్వ‌లింగ సంప‌ర్కుల‌ను ఆ ధియేటర్లు అవ‌మానించాయంటూ వర్మ ట్వీట్

వ‌ర్మ తాజా చిత్రం డేంజ‌ర‌స్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మ‌నే కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

varma (Photo-Video grab)

సంచలన దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు మంగ‌ళ‌వారం భారీ షాక్ త‌గిలింది. వ‌ర్మ తాజా చిత్రం డేంజ‌ర‌స్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మ‌నే కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

కాగా ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య స్వ‌లింగ సంపర్కం నేప‌థ్యంలో డేంజ‌ర‌స్ చిత్రాన్ని వ‌ర్మ రూపొందించారు. నైనా గంగూలీ, అప్స‌రా రాణి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌లేమంటూ పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ తేల్చి చెప్పేశాయి. త‌న సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుమ‌తి ల‌భించిన అంశాన్ని ప్ర‌స్తావించిన వ‌ర్మ‌... ఈ రెండు సినిమా థియేట‌ర్లు త‌న సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు తిర‌స్క‌రించి స్వ‌లింగ సంప‌ర్కుల‌ను అవ‌మానించాయంటూ వ‌ర్మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif