Bhimaa OTT Release Date: ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భీమా స్ట్రీమింగ్, నాలుగు భాషల్లో ఓటీటీలో విడుదల కానున్న గోపిచంద్ మూవీ
టాలీవుడ్ స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 25 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా.. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా అలరించిన ఇందులో వెన్నెల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలకపాత్రల్లో నటించారు. ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్‌ని చూశారా, గౌడ్ సాబ్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ, దర్శకుడిగా పరిచయం అవుతున్న గణేష్ మాస్టర్
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)