Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)
తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Hyderabad, Oct 12: తెలంగాణ (Telangana) సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఊరు, వాడ, పల్లె, పట్టణాలు అని తేడాలేకుండా అంతటా శుక్రవారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, సినీ నటులు సైతం పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Mega Power Star Ram Charan Tej) బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి రామ్ చరణ్ బతుకమ్మ ఆడారు. రామ్ చరణ్ లయబద్ధంగా ఆడుతున్న ఈ బతుకమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు విలన్, త్వరలోనే జరుగబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం