Allu Aravind Dances With Sai Pallavi (Credits: X)

Hyderabad, Feb 14: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది. దీంతో ఇప్పుడు తండేల్ చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్లలో మునిగిపోయింది. ఈ క్రమంలో తండేల్ మూవీ టీం ఇటీవల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సైతం పాల్గొన్నారు. ఇక వేదికపై హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగే పాటకు సాయి పల్లవితో కలిసి అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. గతంలోనూ తండేల్ మూవీ ఈవెంట్లలో సాయి పల్లవితో కలిసి అల్లు అరవింద్ స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్ర‌భాస్‌,మోహ‌న్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు

Here's Video:

వంద కోట్ల క్లబ్ దిశగా..

ఇక తండేల్ మూవీ మొదటి రోజే రూ.21.27 కోట్లు రాబట్టింది. విడుదలై వారం రోజులు గడిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తండేల్ జోరు తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ మూవీ వంద కోట్ల మార్క్ దిశగా పరుగులు పెడుతుంది. ఈ సినిమాలో చైతూ సరసన మరోసారి సాయిపల్లవి కథానాయికగా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ కూడా హిట్ అయ్యింది.

కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల