Ray Stevenson Dies: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత.. థోర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రే స్టీవెన్సన్
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు.
Hyderabad, May 23: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ (Ray Stevenson) కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ (Thor) సినిమా సీరిస్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం సంతాపం తెలిపింది. ఈ వార్త తమను షాక్‌కు గురిచేసిందని ట్వీట్ చేసింది. రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. స్టీవెన్సన్ మృతిపై ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేశారు. స్టీవెన్సన్ నార్త్ ఐర్లాండ్‌లో 1964 మే 25న జన్మించారు. బ్రిటీష్ ఓల్డ్ వీక్ థియేటర్‌లో నటనలో శిక్షణ పొందారు. రే స్టీవెన్సన్ చివరిగా నటించిన ‘డిస్నీ అషోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Newlywed Dies by Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయినా అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య, హైదరాబాద్లో విషాదకర ఘటన
Advertisement
Advertisement
Advertisement