Representative Image

Newdelhi, May 23: 2 వేల నోటు (Rs. 2000) వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన చేసి నాలుగు రోజులైనా.. డిపాజిట్లు (Deposits) మొదలయ్యేది మాత్రం మరికాసేపట్లోనే. ఇదే ఇప్పుడు అసలు కథ. ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ కూడా అలర్ట్‌ అయింది. గతంలో ఉన్న అనుభవాలను మళ్లీ పునారావృతం కాకుండా ప్రత్యేక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి (Notes Exchange) తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలకు ఇది కీలక సమయం. ఒక్క సారిగా వచ్చి పడే ఖాతాదారులను ఎలా అదుపు చేయాలన్న ప్రశ్న బ్యాంక్‌లను వేధిస్తోంది. ఆర్బీఐ గవర్నర్‌ మాత్రం.. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు.

Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు... పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ కూడా

నోట్ల మార్పిడి నిబంధనలు

50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆర్‌బీఐ గుర్తు చేసింది. 2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుంది. ఇక 2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత క్యాష్‌ కూడా బ్యాంకుల్లో అందుబాటులో ఉంచారు. డిపాజిట్ల విషయంలో ఇప్పటికే అవలంబిస్తున్న నిబంధనలనే 2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తింపజేయాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. ఇక పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుంది. 2వేల నోటును ఒక్కోసారి 20 వేల విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా, గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకోవచ్చని ప్రకటించింది. ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా 2,000 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే ఒక లావాదేవీలో 10 నోట్లకు మించి మార్చుకునే వీలుండదు. ఇక గరిష్ట పరిమితిపై ఆర్‌బీఐ కూడా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో, ఇతర శాఖల్లో కేవైసీ, ఇతర నిబంధనల మేరకు.. ఎంతమేర గరిష్ఠంగా క్యాష్‌ డిపాజిట్‌కు అనుమతి ఉంటే, అంత విలువ వరకు 2000 నోట్లను ఖాతాలో వేసుకోవచ్చు. 2వేల నోట్లను ఉసంహరిస్తున్నారే గానీ.. లీగల్‌ టెండర్‌ కొనసాగుతుందని ఆర్‌బీఐ తెలిపింది.

IPL 2023 Shubman Gill: శుభ్ మన్ గిల్ చెల్లిని కూడా వదలని దుండగులు, అయ్యోపాపం..ఏం జరిగిందో తెలిస్తే ఆగ్రహంతో ఊగిపోతారు..