Hyderabad, May 23: తెలంగాణలో (Telangana) భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షంతో పాటు గరిష్ఠంగా 50 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
పగలు ఎండ.. సాయంత్రం వర్షం
హైదరాబాద్ నగరానికి కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రం నుంచి వర్షాలు పడతాయని, కొన్నిరోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బాత్ రూమ్ ఏ దిశలో ఉండాలో తెలుసా ...