వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్యభాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే, ఆ ఇంట్లో ఆనందం, సిరి, సంపదలు, ఆరోగ్యం వెల్లి విరుస్తాయి. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, ఆశీర్వాదాలు ఉంటాయి.
వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ నిర్మించాలి అనేది ప్రతీ ఒక్కరికి డౌట్ ఉంటుంది. వాస్తవానికి.. బాత్రూమ్ లేదా మరుగుదొడ్డి, స్నానాల గది ఇంట్లో ముఖ్యమైన భాగం. ఈ ప్రదేశంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు బాత్రూమ్‌ని వాస్తు ప్రకారం ఎలా నిర్మించాలో తెలుసుకుందాం.
>> వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ బాత్రూమ్ ఉండకూడదు.
>> బాత్రూమ్‌లోని టాయిలెట్ సీటు ఎల్లప్పుడూ పశ్చిమం లేదా వాయువ్య దిశలో ఉండాలి.
>> బాత్రూమ్‌ను దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేయకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
>> ఇప్పటికే మీ ఇంట్లో దక్షిణ దిశలో నిర్మించినట్లయితే.. బాత్రూమ్ తలుపుకు నల్లటి రంగు వేయించండి. ఫలితంగా దాని ప్రతికూల ప్రభావం ముగుస్తుంది.
>> దక్షిణ దిశలో బాత్ టబ్, షవర్ ఉంచవద్దు. బాత్రూమ్‌కు పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగును ఎంచుకోండి. గోధుమ, తెలుపు రంగులు బాత్రూమ్ కోసం మంచివి.
>> బాత్రూమ్ కుళాయిలు నుంచి నీరు లీక్ అవకుండా చూసుకోవాలి. కుళాయి నుండి నీరు కారడం మంచిది కాదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు.
>> బాత్రూమ్ తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. ఇనుప తలుపులకు బదులుగా చెక్క తలుపులను ఏర్పాటు చేయండి.
>> ప్రతి బాత్రూమ్‌కి కిటికీ ఉండాలి. దాని నుంచి ప్రతికూల శక్తి బయటకు వెళుతుంది. కిటికీ తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి.