Suchitra Apologizes to Karthik Kumar: మాజీ భర్తని గే అన్నందుకు క్షమాపణలు చెప్పిన త‌మిళ సింగ‌ర్ సుచిత్ర‌, వీడియో ఇదిగో..

Singer Suchitra apologizes to Karthik Kumar

త‌మిళ సింగ‌ర్ సుచిత్ర‌ త‌న మాజీ భ‌ర్త న‌టుడు, కమెడియన్ కార్తీక్ కుమార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సుచిత్ర త‌న మాజీ భ‌ర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌లు గేలు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ వ్యాఖ్యలపై సుచిత్ర‌ త‌న ప్ర‌తిష్ఠ‌కు న‌ష్టం క‌లిగించినందుకు రూ.కోటీ ప‌రిహారం చెల్లించాల‌ని కోరుతూ త‌న న్యాయ‌వాది ద్వారా ఆమెకు నోటీసులు పంపాడు. అయితే ఈ కేసును విచారించిన కోర్టు.. కార్తీక్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సుచిత్రపై మధ్యంతర నిషేధం విధించింది. రజనీకాంత్ నా గురించి అలా అనేసరికి షాకయ్యాను, అల్లు అర్జున్‌ మాటల్లో..

ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులో విచార‌ణ‌లో ఉండగా.. తాజాగా తాను చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల తన మాజీ భ‌ర్త‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది సింగ‌ర్ సుచిత్ర‌.  కార్తీక్ కుమార్‌ని గే అని పిలిచి అతని కెరీర్‌ను నాశనం చేశాను. అతని కెరీర్‌ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. నిజానికి కార్తీక్ కుమార్ ఒక మ‌గాడు. ఈ క్ష‌మాప‌ణ‌ల వ‌ల‌న మీకు మరిన్ని సినిమా అవకాశాలు వ‌స్తాయని ఆశిస్తున్నాను అంటూ సైటైరిక‌ల్‌గా చెప్పుకోచ్చింది

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now