Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌ వద్ద లాఠీ ఛార్జ్, అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఎగబడిన అభిమానులు

Telangana: Fans of actor Allu Arjun thronged the Sandhya theatre in Hyderabad Police resorted to mild lathicharge to control the crowd.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలు గ్రాండ్ లెవెల్లో మరికొద్ది నిమిషాల్లో పడనున్నాయి. ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇవాళ రాత్రి 9.30 గంటలకు అంటే మరికొద్ది నిమిషాల్లో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద లాఠీ ఛార్జ్ జరిగింది. ప్రీమియర్ షో చూసేందుకు బన్నీ తన ఫ్యామిలీతో ఆ థియేటర్‌కు వస్తాడని టాక్ వినిపించింది. దీంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా అక్కడకి తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. ఏం చేయాలో తెలియక జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Fans of actor Allu Arjun thronged the Sandhya theatre 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement