Naresh-Pavitra Wedding Video: ఈ పెళ్లి వీడియో నిజమేనా లేక ప్రమోషన్ కోసమా, నరేష్‌- పవిత్రా లోకేశ్‌ పెళ్లి వీడియో మళ్లీ ఇంటర్నెట్లో వైరల్

సినీ నటులు నరేష్‌- పవిత్రా లోకేశ్‌ పెళ్లి బంధంతో ఒకటయినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వీడియోను స్వయంగా నరేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్‌ రాసుకొచ్చారు

Nareshand-Pavitralokesh (Photo-Twitter/Naresh)

సినీ నటులు నరేష్‌- పవిత్రా లోకేశ్‌ పెళ్లి బంధంతో ఒకటయినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వీడియోను స్వయంగా నరేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్‌ రాసుకొచ్చారు.ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్‌ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు.

గతంలోనూ నరేష్‌ న్యూఇయర్‌ సందర్భంగా పవిత్రా లోకేశ్‌కు లిప్‌లాక్‌ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.కట్‌ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. తాజాగా విడుదలైన వీడియో కూడా నరేష్‌-పవిత్రాలది కేవలం రీల్‌ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.నరేష్‌కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement