SSMB 29 Latest Update: మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ SSMB29 లేటెస్ట్ వీడియో ఇదిగో, పొడవాటి జుట్టు, గడ్డంతో అదరగొడుతున్న సూపర్ స్టార్ న్యూలుక్
మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో SSMB 29 రూపొందుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తాజాగా వీరందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు
మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో SSMB 29 రూపొందుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తాజాగా వీరందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మహేశ్‌బాబు-రాజమౌళిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ ఇదిగో, రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్రలో అలరించినున్న టాలీవుడ్ హీరో
అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)