Air India: ఎయిరిండియా విమానం పుడ్‌లో మెటల్‌ బ్లేడ్‌, ప్రయాణికుడి ఫిర్యాదుపై కంపెనీ స్పందన ఏంటంటే..

అయితే ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్‌ బ్లేడ్‌ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.

Air India (photo-Wikimedia Commons)

ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అయితే ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్‌ బ్లేడ్‌ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.

ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ..‘మా విమానంలో ఒక ప్రయాణికుడి భోజనంలో మెటల్‌ వస్తువు గుర్తించారు. దానిపై వెంటనే దర్యాప్తు జరిపాం. కూరగాయలు కట్‌ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఆ మెటల్‌ వస్తువు వచ్చినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’ అని చెప్పారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)