Air India to Buy Boeing Planes: బోయింగ్ విమానాల కొనుగోలుపై క్లారిటీ, 470 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్, మిగిలిన 370 ఆప్షన్‌గా ఉంచామని తెలిపిన ఎయిర్ ఇండియా CCTO
కేవలం 470 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చామని, మిగిలిన 370 ఆప్షన్ గా ఉంచామని తెలిపారు.
యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్, యుఎస్ బోయింగ్ నుండి ఎయిర్‌లైన్స్ 840 విమానాలు ఆర్డర్ ఇవ్వలేదని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫీసర్ (CCTO) నిపున్ అగర్వాల్ సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేశారు. కేవలం 470 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చామని, మిగిలిన 370 ఆప్షన్ గా ఉంచామని తెలిపారు. వాటికితదుపరి దశాబ్దంలో ఎయిర్‌బస్- బోయింగ్ నుండి కొనుగోలు హక్కులు ఉన్నాయని ఆయన అన్నారు. ఎయిర్‌బస్ సంస్థ ఆర్డర్‌లో 210 A-320/321 నియో/XLR, 40 A350-900/1000 ఉన్నాయి. బోయింగ్ సంస్థ ఆర్డర్‌లో 190 737-మాక్స్, 20787లు, 10777లు ఉంటాయి.Airbus ప్రకారం, A350s కోసం డెలివరీలు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయి, అయితే, ఈ విమానాల డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎయిర్‌లైన్ చెప్పలేదు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)