సూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తడ మండలం బోడి లింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళుతున్న సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 30మంది విద్యార్థులున్నారు. బస్సు బోల్తాపడటంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రాణాపాయం లేకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tirupati School Bus Accident
Some children were injured after the #SchoolBus of #NarayanaSchool , #Sulurpeta , they were travelling in lost control and overturned near Bodi Lingala Padu in #Tada mandal, #Tirupati district, today.
The bus carrying about 30 students veered off the road… pic.twitter.com/H8bNeE6zFd
— Surya Reddy (@jsuryareddy) February 21, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)