తిరుమల తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట సాధువులు ఆమరణ దీక్షకు దిగారు.అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం జరుగుతోంది. హోటల్‌కు సంబంధించిన నిర్మాణాలను ఆపాలంటూ కొంత కాలంగా శ్రీనివాసనంద స్వామి పోరాటం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శ్రీనివాసానంద స్వామి ఆధ్వర్యంలో సాదువులు 150 మంది దాన్ని ఆపాలంటూ దీక్షకు దిగారు.
ప్రభుత్వం హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందనే వార్తల మధ్య మరోసారి ఆందోళనకు దిగారు. గతంలో వ్యతిరేకించిన కూటమి..ఇప్పుడెలా అనుమతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారాహీ డిక్లరేషన్ అంటే ఇదేనా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సాధువులు ప్రశ్నిస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షణ అంటున్న పవన్ ఈ విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.తిరుమల ప్రక్షాళన అన్న సీఎం చంద్రబాబు దీనికేం సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు.
Hindu groups stage protest against construction of Mumtaz Hotel near Tirupati temple
తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి వివాదం రగులుతోంది.
టీటీడీ పరిపాలనా భవనం వద్ద స్వామీజీలు ఆమరణ దీక్ష ప్రారంభించడం, వారాహి డిక్లరేషన్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం దీనికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది.
సాధు పరిషత్, టీటీడీ అధికారులపై… pic.twitter.com/rIbWj3BEJI
— Aadhan Telugu (@AadhanTelugu) February 12, 2025
Tirupati:
తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన హిందూ సంఘాలు, స్వామీజీలు!!
టిటిడి భవనం ఎదుట ముంతాజ్ హోటల్ కు స్థలం కేటాయించడంపై నిరసన!!
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన శ్రీనివాసానంద సరస్వతి స్వామి!!
స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష!!#PawanKalyan… pic.twitter.com/yEVfc36oko
— cinee worldd (@Cinee_Worldd) February 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)