ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర(Pawan Kalyan) ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించనున్నారు పవన్. తీవ్రమైన జ్వరం మరియు స్పొండిలైటిస్ నుండి కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్రను(spiritual journey) ప్రారంభించారు.
ఇవాళ ఉదయం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించనున్నారు పవన్(pawan kalyan devotional tour).
తన ఆధ్యాత్మిక యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ సంప్రదాయ ధార్మిక వస్త్రధారణలో కనిపించారు. ఇక యాత్ర ముగిసిన వెంటనే తిరిగి తన శాఖల పరిధిలోని సమస్యలను పరిష్కరించనున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యల కారణంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పవన్.
Pawan Kalyan spiritual journey begins
కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్
కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకోనున్న పవన్ https://t.co/M4uEhoTuGk pic.twitter.com/fuHgWrOj3q
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)