 
                                                                 Narayanpet, Feb 21: నారాయణపేట (Narayanpet )జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) . అప్పక్ పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. బీపీసీఎల్ కంపెనీ సహకారంతో పూర్తిగా మహిళలచే ఈ పెట్రోల్ బంక్ నడవనుంది. రాష్ట్రంలోనే మొదటి సారి ఈ తరహా బంక్ ను ప్రారంభించారు సీఎం9Women Empowerment).
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని... మహిళలు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం.. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది ఉన్నారన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం... అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం ... వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు(Soalr Plant) ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం అన్నారు. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం అన్నారు.
త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నాం అని... సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నాం అన్నారు. రూరల్, అర్బన్ అనే తేడా లేదు… తెలంగాణలో మహిళలంతా ఒక్కటే..అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం అన్నారు.
ఎంపీ డీకే అరుణ ...కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం ... పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టండన్నారు. నిధులు మేం ఇస్తాం..నిర్వహణ మీరు చేయండి అన్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
