Betting Sites Ads: బెట్టింగ్‌ సైట్ల యాడ్స్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు, ప్రైవేట్‌ శాటిలైట్‌ చానళ్లకు హెచ్చరికలు జారీ చేసిన ప్రసార మంత్రిత్వ శాఖ

బెట్టింగ్‌ సైట్లకు సంబంధించిన యాడ్స్ ప్రసారం చేయొద్దని ప్రైవేట్‌ శాటిలైట్‌ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, న్యూస్‌ వెబ్‌సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.

Online Betting. (Photo Credits: Pixabay)

బెట్టింగ్‌ సైట్లకు సంబంధించిన యాడ్స్ ప్రసారం చేయొద్దని ప్రైవేట్‌ శాటిలైట్‌ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, న్యూస్‌ వెబ్‌సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. బెట్టింగ్‌ ప్లాట్‌ఫాంలు, వాటి అనుబంధ వెబ్‌సైట్లకు సంబంధించిన ప్రకటనలను ఏ రూపంలోనూ ప్రసారం చేయొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేట్‌ శాటిలైట్‌ చానళ్లకు గట్టిగా సూచించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement