Bihar Shocker: అత్యాచారానికి ఒఫ్పుకోలేదని దారుణం, బాలికను 13 సెకండ్లలో ఎనిమిది సార్లు క‌త్తితో పొడిచిన కామాంధుడు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు

అత్యాచారాన్ని ప్ర‌తిఘ‌టించిన ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దివే బాలిక‌పై ఓ కామాంధుడు క‌త్తిపోట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో డిసెంబ‌ర్ 19న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూసింది.

Representative Image Murder ( Photo Credits : Pixabay

బీహార్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అత్యాచారాన్ని ప్ర‌తిఘ‌టించిన ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దివే బాలిక‌పై ఓ కామాంధుడు క‌త్తిపోట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో డిసెంబ‌ర్ 19న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూసింది. సీసీ టీవీ పుటేజి (Shocking CCTV footage) ప్రకారం.. ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి బాలిక స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా మాటు వేసిన నిందితుడు క‌త్తితో బాలిక‌పై దాడి చేశాడు. 13 సెకండ్లలో ఎనిమిది సార్లు (Girl stabbed 8 times in 13 seconds) క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచాడు. నిందితుడిని ఓ వ్య‌క్తి లాగివేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా అత‌డు బాలిక‌పై క‌త్తిపోట్ల‌కు గురిచేయ‌డం ఈ వీడియోలో క‌నిపించింది.

బాలిక‌ను గోపాల్‌గంజ్‌లోని స‌ద‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ఆపై మెరుగైన వైద్యం కోసం ప‌ట్నా మెడిక‌ల్ కాలేజ్ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గ‌తంలోనూ బాలిక స్కూల్‌కు వెళుతూ, వచ్చే స‌మ‌యాల్లో వేధిస్తుండేవాడ‌ని బాధితురాలి త‌ల్లితండ్రులు తెలిపారు. కర్ణాటకలో దారుణ ఘటన, మొబైల్ దొంగిలించాడని జాలరిని పడవపై తలకిందులుగా వేలాడదీశారు, కొడుతూ దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)