Sarpanch Dies by Suicide: కొండారెడ్డి ప‌ల్లె గ్రామ మాజీ స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్య‌, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన హరీష్ రావు, మీ అన్నదమ్ముళ్ల‌పై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలోని కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయ‌న అన్నారు

BRS Harish Rao Shocking Comments on Telangana CM Revanth Reddy(X)

తెలంగాణ రాష్ట్రంలోని కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయ‌న అన్నారు. రేవంత్.. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్లపై చట్ట రీత్యా చర్యలకు సిద్ధమా..? మీ అన్నదమ్ముళ్ల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా..? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ముళ్ల‌పై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

రోడ్డెక్కిన ప్రజాపాలన దరఖాస్తులు...సైబర్‌ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటి?..హరీశ్ రావు ప్రశ్న

Harish Rao Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement