DK Shivakumar Black Magic Allegation: నన్ను నాశనం చేయడానికి కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు, డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

కాంగ్రెస్‌ ప్రభుత్వం, తనపై కొందరు కేరళలో తాంత్రిక పూజలు జరుపుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మా ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు

Karnataka Congress President DK Shivakumar. (Photo credits: Twitter/ANI)

కాంగ్రెస్‌ ప్రభుత్వం, తనపై కొందరు కేరళలో తాంత్రిక పూజలు జరుపుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మా ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు. కేరళలోని రాజ రాజేశ్వరీ ఆలయంలో శత్రువులను తొలగించటం కోసం కొందరు ‘‘శత్రు భైరవీ యాగం’’ (అగ్నిబలి) పేరిట పూజలు చేస్తున్నారు. పంచబలి(ఐదు వస్తువులను బలి ఇవ్వటం) చేస్తున్నారు. దీని కోసం ఎర్రమేక, 21 బర్రెలు, మూడు నల్ల మేకలు, ఐదు పందులను బలి ఇచ్చారు.

ఈ పూజలు ఇంకా కొనసాగుతున్నాయని డీకే తెలిపారు. ఆ పూజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోందని అన్నారు. అయితే ఈ పూజలు ఎవరూ జరిపిస్తున్నారన్న విషయాన్నిమాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ తాంత్రిక పూజులు జరుగుతున్నాయని తెలిపారు. అలా చేయటం వారి నమ్మకం. దాన్ని వారికే వదిలేస్తున్నా. వారు ఏం చేయాలకుంటే అది చేసుకోవచ్చు. వాళ్ల పూజల నుంచి మమ్మల్ని రక్షించే శక్తి మా వెంటే ఉంది’’ అని డీకే శివకుమార్‌ అన్నారు.  వీడియో ఇదిగో, 1982 వరకు మహాత్మాగాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు, ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now