
Karnataka Shocker: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని మోసం చేసిన ఘటన జీర్ణించుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాలకు వెళ్తే తుముకూరు జిల్లాలోని గుబ్బి పట్టణానికి చెందిన అనిత (పేరు మార్చాం) అదే పట్టణానికి చెందిన సురేష్ తో సరిగా 12 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు కానీ సరిగ్గా అదే సమయంలో వారి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించడంతో వారి జీవితం అతలాకుతలం అయిపోయింది.
సురేష్ స్నేహితుడు శరత్ తరచూ వారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శరత్ సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం సైతం చేస్తుండేవాడు. అయితే సురేష్ తరచూ వ్యాపార పనుల మీద బెంగళూరు చెన్నై వెళ్తూ ఉండేవాడు. ఈ సమయంలో శరత్ తరచూ తన స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్లి అతని భార్య అనితతో చనువుగా ఉండేవాడు. అనిత కూడా అప్పుడప్పుడు చేతి ఖర్చులకు శరత్ వద్ద నుండి డబ్బులు తీసుకునేది. క్రమంగా వారి బంధం శారీరకంగా దగ్గర అయ్యే వరకు చేరింది. సురేష్ ఇంట్లో లేని సమయంలో అదే అదునుగా భావించిన శరత్ తరచుగా అనితతో శారీరక సంబంధం కొనసాగించేవాడు. అయితే ఈ క్రమంలోనే సురేష్ కు ఒకరోజు అనుమానం వచ్చింది. తాను ఊరు వెళ్తున్నా అంటూ అనితతో చెప్పి వెళ్ళాడు. కానీ సురేష్ వేరే ఊరుకు వెళ్లకుండా పక్క సందులోనే తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని వేచి చూశాడు.
ఒక గంట తర్వాత శరత్ బైక్ పైన వచ్చి తన ఇంట్లో దూరిన సంగతి గమనించాడు. ఇంతలో సురేష్ ఈసారి రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరినీ పట్టుకోవాలని భావించి నెమ్మదిగా ఇంటికి చేరి ఇంటి వెనుక బెడ్ రూమ్ కిటికీ తెరిచి తొంగి చూశాడు. ఆ సమయంలో అనిత, శరత్ ఇద్దరు రాసలీలలో మునికి తేలుతున్నాను. అది చూసిన సురేష్ రక్తం మరిగిపోయింది. నమ్ముకున్న స్నేహితుడు కట్టుకున్న భార్య ఈ విధంగా తనను మోసం చేస్తారని తెలిసి కుమిలిపోయాడు. వెంటనే తన స్నేహితుడు బంధువులను పిలిచి. రహస్యంగా తలుపు ఓపెన్ చేసి లోపలికి దూరి అనితా ఇంకా శరత్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇది చూసిన సురేష్ తరపు బంధువులు శరత్ చితక బాదగా, అనితను సైతం నిలదీశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్క దిద్ది కేసు కౌన్సిలింగ్ నిర్వహించారు.