LIC Alert to People: తప్పుడు ప్రచారంపై ప్రజలను అలర్ట్ చేసిన ఎల్‌ఐసీ, అటువంటి ప్రకటనలు కనిపిస్తే వెంటనే మాకు పంపాలని సూచన
ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) బుధవారం X వేదికగా పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఎల్‌ఐసీతో పాటు, సంస్థకు చెందిన వ్యక్తుల పేరుతో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది
ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) బుధవారం X వేదికగా పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఎల్‌ఐసీతో పాటు, సంస్థకు చెందిన వ్యక్తుల పేరుతో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.ఈతరహా ప్రకటనలను గుర్తిస్తే వెంటనే ఎల్‌ఐసీ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా యూఆర్‌ఎల్స్ పంపాలని సూచించింది. అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అధీకృత సమాచారం కోసం నేరుగా తమనే సంప్రదించాలని సూచించింది.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)